JAISW News Telugu

Free Bus Effect : ఉచిత బస్సు ఎఫెక్ట్ : సీటు దొరక్క డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ 

Free Bus Effect

Free Bus Effect

Free Bus Effect : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. దీంతో టీజీ ఆర్టీసీ అక్యూపెన్సీ భారీగా పెరిగింది. ఉచిత ప్రయాణం కారనంగా కొంత మంది మహిళలు అవసరం ఉన్నా లేకున్నా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రయాణాలు సాగించే సాధారణ ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాలు వెలుగులోకి వస్తుననాయి. ఇక విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. సాయంత్రం అయితే తమ ఊళ్లల్లోకి వెళ్లేందుకు బస్సుల్లో నిల్చునేందుకు  కూడా అవకాశం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ కూడా ఎక్స్ ప్రెస్ బస్సుల ట్రిప్పుల  సంఖ్యను తగ్గిస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.  

ఉన్న ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగుల్లో జనాలు పెద్ద సంఖ్యలో ఎక్కుతున్నారు. బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్న వారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. తాజాగా ఓ మహిళకు  బస్సులో సీటు దొరక్కపోవడంతో ఏకంగా  డ్రైవర్ సీట్ లోనే  కూర్చొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ వీడియోలో  ఓ మహిళ బస్సు కోసం ఆర్టీసీ బస్టాండ్ లో నిరీక్షిస్తున్నది. చాలా సేపు ఎదురు చూసిన తర్వాత బస్ రావడంతో ఆమె ఎక్కేలోపు బస్సు  ప్రయాణికులతో నిండిపోయింది. దీంత ఆమె బస్ దిగి, మరో బస్ వచ్చే దాకా ఎదురు చూసింది.

మరో బస్సు రాగానే అందులో ఎక్కింది..  కానీ అప్పటికే సీట్లు నిండిపోవడంతో సహనం కోల్పోయిన ఆమె డ్రైవర్ సీటులో కూర్చొంది. టైమ్ కావడంతో డ్రైవర్ బస్ వద్దకు రాగా, తన సీటు లో కూర్చొన్న మహిళను చూసి డ్రైవర్ షాకయ్యాడు. అక్కడి నుంచి దిగాలని డ్రైవర్ కోరాడు. కానీ ఆమె తనకు సీటు చూపించాలని  కోరింది. దీంతో విసుగెత్తిన డ్రైవర్ మహిళ సీటులోంచి దిగితేనే బస్సు కదులుతుందని మిగతా ప్రయానికులతో  చెప్పాడు. దీంతో ప్రయాణికులు ఆ మహిళకు సర్ది చెప్పడంతో ఆమె డ్రైవర్ సీటు నుంచి దిగింది.

Exit mobile version