
Telangana cabinet
Telangana cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మీనాక్షి నటరాజన్ మరియు కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల అనంతరం నలుగురు కొత్త మంత్రులకు కేబినెట్‌లో స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్ మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.