Four marriages : పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు.. ఆర్మీ జవాన్ పై కేసు నమోదు

Four marriages

Four marriages

Four marriages : నిత్య పెళ్లికొడుకులా నలుగురిని పెళ్లి చేసుకున్న ఓ ఆర్మీ జవాన్ పై యూపీలో కేసు నమోదైంది. ఆర్మీలో పనిచేస్తున్న మనీష్ కుమార్ గత పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని హైదరాబాద్ కు చెందిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2015లో తనకు హైదరాబాద్ లో పరిచయమైన మనీష్ కుమార్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను వేధింపులకు గురిచేసేవాడని మహిళ వెల్లడించింది. 2018లో తాను గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని, అతని మాట వినకపోవడంతో తనను విడిచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో తెలిపింది.

అనంతరం మనీష్ కోసం వెదకగా.. అతడికి మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసినట్లు పోలీసులకు వెల్లడించింది. ఆ తర్వాత తాను మారినట్లు చెప్పి కొంతకాలం తన దగ్గరే ఉన్నాడని, తనకు కుమారుడు పుట్టిన అనంతరం మరోసారి వెళ్లిపోయాడని ఆ మహిళ పేర్కొంది. ఆ తర్వాత యూపీలోని మేరఠ్ లో ఇద్దరు మహిళలతో అతడు దొరికినట్లు చెప్పింది. ఈ ఘటనపై ముందుగా కంకరఖేడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని, అందుకే జిల్లా ఎస్ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TAGS