JAISW News Telugu

Sabarimala : శబరిమల వద్ద రోప్ వే ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన

Sabarimala

Sabarimala

Sabarimala : శబరిమల వద్ద రోప్ వే ప్రాజెక్టుకు ఈ మండల కాలంలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.  రోప్‌వేతో సన్నిధానం నుంచి పంబ చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుందని దేవస్వోమ్ బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.250 కోట్లు. 2.7 కిమీ దూరం ఉండగా 5 టవర్లు (11.12 ఎకరాల భూమి) నిర్మించనున్నారు. నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసే అవకాశముంది.

ఇటీవల రెవెన్యూ, దేవస్వోమ్, అటవీ శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ప్రాజెక్టుపై తుది నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది శబరిమల సీజన్ ముగిసే లోపు రోప్ వేకు శంకుస్థాపన చేయాలని దేవస్వోమ్ శాఖ ఆలోచనలో ఉంది. 2027 శబరిమల సీజన్ నాటికి రోప్ వేను ప్రారంభించాలనేది లక్ష్యంగా ఉంది.

Exit mobile version