JAISW News Telugu

Telangana Yellow Army : ఒకప్పటి తెలంగాణ పసుపు దండు.. ఇది కదా టీడీపీ రేంజ్!

Telangana Yellow Army

Telangana Yellow Army

Telangana Yellow Army : తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఒక ప్రభంజనం అని చెప్పాలి. తెలుగు వారి ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అనాటి నుంచి నేటి వరకూ తెలుగు దేశం ప్రభ ఇసుమంత కూడా తగ్గలేదు అనడంలో అతిశయోక్తి లేదు. 1980ల నాటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా టీడీపీని ప్రారంభించిన అతి కొద్ది నెలల్లోనే అధికారం దక్కించుకుని చర్రిత సృష్టించారు ఎన్టీఆర్. 1995 సంవత్సరంలో సంభవించిన పలు పరిణామాల వల్ల టీడీపీ పగ్గాలు చంద్రబాబు నాయుడి చేతికి వచ్చాయి. అప్పటి నుంచి ఏకధాటిగా 2004వరకు చంద్రబాబు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014-19 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసి మరో మారు అధికారంలో దక్కించుకునే పనిలో పడ్డారు.

టీడీపీ ప్రారంభించకముందు తెలంగాణలో అంతా రెడ్ల రాజ్యమే నడిచింది. నక్సలైట్ల భయానికి పట్టణాలకు వచ్చిన దొరలు ఎమ్మెల్యేలుగా తమ దోపిడీని కొనసాగించారు. వాస్తవానికి తెలంగాణలో బీసీ, ఎస్సీ,ఎస్టీలే ప్రబలంగా ఉంటారు. ముఖ్యంగా బీసీ జనాభా అత్యధికం. అయినా కూడా రాజ్యాధికారంలో వారి పాత్ర శూన్యం. కాంగ్రెస్ నలభై ఏండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండి సృష్టించని అరాచకం లేదు. మొత్తం రెడ్ల అధికారమే. బడుగు, బలహీన వర్గాలను నీచంగా చూశారు.

ఈక్రమంలో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించడం తెలంగాణలో బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో బీసీలు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. ఎన్టీఆర్ చొరవతో ఎంతో మంది బీసీలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులను అలంకరించారు. దీంతో తెలంగాణ బీసీలంతా అప్పటి నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే వరకు టీడీపీతోనే ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు యువకులకు, చదువుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటి దాక రాజకీయాలను అంటిముట్టని ప్రతీ వర్గానికి ఆయన అవకాశాలు ఇచ్చారు. దీంతో ఎంతో మంది యువకులు టీడీపీ నుంచి పదవులు చేపట్టారు.

తెలంగాణలో అనాటి యువకుల్లో నేటి అగ్రనాయకులైన కె.చంద్రశేఖర్ రావు, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మైనంపల్లి హన్మంతరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బోడికుంటి వెంకటేశ్వర్లు, ప్రణయ్ భాస్కర్..ఇలా ఒకరేమిటి ఇప్పటి రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ఎందరో టీడీపీ పసుపు దండే కావడం విశేషం. తెలంగాణకు పనిచేసిన ఇద్దరు సీఎంలు టీడీపీ నాయకులే కావడం విశేషం. అందులో ఒకరు కేసీఆర్, మరొకరు రేవంత్ రెడ్డి.

ఇప్పుడు తెలంగాణలో ఉన్న కీలక నేతలందరూ దాదాపు సగం మందికి పైగా టీడీపీకి చెందిన వారే. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా కొంతమంది కొత్త నాయకులు తయారైనా టీడీపీ నుంచి వచ్చిన వారు ప్రముఖ రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు. తాజాగా ఒకప్పటి తెలంగాణ తెలుగు దేశం నాయకుల ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోను టీడీపీ శ్రేణులు విపరీతంగా షేర్ చేస్తున్నాయి. ఎంతో మంది నేతలను తయారుచేసిన ఘనత టీడీపీకే సొంతమంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version