JAISW News Telugu

Supreme Court : సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ మాజీ  సిఎం కేసీఆర్

Supreme Court

Supreme Court

Supreme Court : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం సీజేఐ విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో పవర్ కమిషన్ వేసిన విషయం తెలిసిందే.

విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను (పవర్ కమిషన్) రద్దు చేయాలని ఇటీవల హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు.

కాగా, విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగలేదని, ఈఆర్సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ద సంస్థ అని, దీనిపై విచారణ కమిషన్ వేయకూడదని వాదిస్తున్నారు.

Exit mobile version