Heroine Rekha : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖతో పాక్ మాజీ క్రికెటర్ ప్రేమాయణం?

Heroine Rekha

Heroine Rekha and Imran khan

Bollywood Heroine Rekha : క్రికెట్, సినిమా ఈ రెండింటి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. క్రికెటర్లు ఆటలో పేరు తెచ్చుకోగా, బాలీవుడ్ హీరోయిన్లు తమ గ్లామర్,  నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది క్రికెటర్లు  బాలీవుడ్ బ్యూటీలతో లవ్ ఎఫైర్లు నడిపిన విషయం తెలిసిందే. ఇందులో కొంతమంది క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లి చేసుకోగా మరికొందరు ప్రేమ కథలతోనే ముగింపు పలికారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు అంటే పాక్ క్రికెటర్లు వెర్రెక్కి పోయేవారు. అలాంటి వారిలో పాక్ టాప్ క్రికెటర్ కూడా ఓ బాలీవుడ్ బ్యూటీతో లవ్ ఎఫైర్ నడిపాడనే రూమర్లు అప్పట్లో వినిపించాయి. పాకిస్థాన్  కు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్  ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం వెర్రెక్కిపోయేవాడని అప్పట్లో బాలీవుడ్ లో టాక్ నడిచింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ. ఇమ్రాన్ ఖాన్ 1992లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్సీని చేపట్టాడు. ఆ సమయంలో పాక్ కు వన్డే ప్రపంచకప్ టైటిల్‌ కూడా సాధించిపెట్టాడు. ఇమ్రాన్‌కు పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా అభిమానులు ఉన్నారు. ఇమ్రాన్ బాలీవుడ్ బ్యూటీలతో లవ్ ఎపైర్లు నడిపాడు. అలా లవ్ ఎఫైర్లు నడిపిన హీరోయిన్లలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖ పేరు కూడా ఉన్నట్లు అప్పట్లో బాలీవుడ్ లో రూమర్లు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ , రేఖల ప్రేమకథకు సంబంధించిన కొన్ని రూమర్లు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అవేంటో తెలుసుకుందా.

ఇమ్రాన్ ఖాన్, రేఖల మధ్య ప్రేమాయణం  
ఇమ్రాన్ ఖాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. ఇమ్రాన్ పాకిస్థాన్ క్రికెట్‌ను సమూలంగా మార్చేందుకు కృషి చేశాడు. 1985 లో ఇమ్రాన్-  రేఖల మధ్య ప్రేమ చిగురించిందని అప్పటట్లో టాక్ నడిచింది. ఆ సమయంలో ఈ పాకిస్తానీ క్రికెటర్ హీరోయిన్ రేఖతో ఓ నెలంతా గడిపాడని గాసిప్స్ వచ్చాయి. అప్పట్లో ఇమ్రాన్- రేఖ కూడా చాలాసార్లు నైట్ క్లబ్‌లలో కలిసి మీడియా కంటపడ్డారు. తన కూతురికి జోడీగా ఇమ్రాన్ ఖాన్‌ను మించిన వరుడు ఎవరూ దొరకడం లేదని రేఖ తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు కొన్ని పత్రికల్లో  అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వీరి వివాహం చేసేందుకు ఓ జ్యోతిష్యుడిని కూడా సంప్రదించినట్లు సమాచారం.

 ప్లేబాయ్ ఇమ్రాన్  
అయితే ఈ పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు ప్లేబాయ్ అనే ముద్ర ఉంది. బాలీవుడ్ లోని చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపించాడని టాక్ ఉంది. ఓ ఇంటర్వ్యూలో తన లవ్ ఎఫైర్ల విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ కూడా అంగీకరించాడు.  అయితే తాను ఏ హీరోయిన్ ను కూడా పెళ్లి  చేసుకోనని చెప్పేశాడు. ఇమ్రాన్ రేఖ తో లవ్ ఎఫైర్ కంటే ముందు బాలీవుడ్ స్టార్ జీనత్ అమన్‌తో కూడా రిలేషన్ కొనసాగించాడనే టాక్ ఉంది.  ఆ తర్వాత పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు నడిపి ప్లేబాయ్ ముద్ర వేయించుకున్నాడు.

TAGS