Nandigam Suresh : జైలులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు అస్వస్థత.. జీజీహెచ్ కు తరలింపు

Nandigam Suresh
Nandigam Suresh : జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు చెప్పడంతో జైలు అధికారులు ఆయనను వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు సురేశ్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆయనను అరెస్టు చేసే సమయంలోనే భుజం నొప్పి ఉన్నట్లు జైలు అధికారులకు సురేశ్ తెలిపినట్లు సమాచారం.
వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం గుంటూరు జైలుకు ఆయనను తరలించారు. అక్కడ శుక్రవారం అస్వస్థతకు గురవడంతో ఆయనను పూర్తిస్థాయి వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తీసుకువెళ్లారు.