Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నందిగం బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం హైకోర్టులో తీర్పు వెలువరించింది. నందిగం సురేశ్ మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పు కోసం వైసీపీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే చివరకు హైకోర్టు తీర్పుతో నందిగం సురేశ్ కు హైకోర్టులో చుక్కెదురయింది.