Nandigam Suresh : మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ అరెస్టు

Nandigam Suresh
Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు మళ్లీ అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటిే నందిగం సురేశ్ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు పమర్పించక పోవడంతో సురేశ్ జైలులోనే ఉన్నారు. మరోవైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ కు అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.
2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ మృతి చెందింది. అప్పట్లో ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేశ్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు. వైసీపీ అధికారంలో ఉండడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభమైంది.