Mohammad Azharuddin : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హెచ్ సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో అజహరుద్దీన్ కు ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజహర్ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అజహర్ కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది.