JAISW News Telugu

Patnam Narendra Reddy : లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి అరెస్టు

Patnam Narendra Reddy

Patnam Narendra Reddy

Patnam Narendra Reddy : బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేంద్ర రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించి విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు.

లగచర్ల ఘటనలో కీలక నిందితుడు సురేశ్ తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. మణికొండలో నివాసముంటున్న సురేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఘటన సమయంలో లగచర్లలో ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version