Sidda Raghava Rao : వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా

Sidda Raghava Rao
Sidda Raghava Rao : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహ న్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శిద్దా రాఘవరావు తన లేఖలో వెల్లడించారు.
శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపినా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించగా ఆయన తిరస్కరించారు. చివరికి శిద్దా మౌనంగా ఉండిపోయారు. ఈ దఫా తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.