Ex Minister Chinarajappa : మాజీ మంత్రి శ్రీ చినరాజప్ప పున్నమి ఘాట్ నుండి దేవాలయానికి తన వ్యక్తిగత వాహనాన్ని వదిలి ప్రోటోకాల్ వాహనంలో ప్రయాణించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన మాజీ మంత్రి చినరాజప్ప పున్నమి ఘాట్ వరకు తన వ్యక్తిగత వాహనంలో వచ్చారు. అక్కడ వ్యక్తిగత వాహనాన్ని వదిలేసి ప్రొటోకాల్ వాహనంలో ప్రయాణించి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మాజీమంత్రి చినరాజప్ప ప్రొటోకాల్ వాహనంలో పయనించడం ద్వారా ప్రజలు మరియు భక్తుల మన్ననలు పొందారు. ఇలాంటి సామాజిక బాధ్యతను ప్రదర్శించే ప్రజా ప్రతినిధులు ఎంతో అభినందనీయులు. చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పును తీసుకురావడంలో ఎంత ప్రభావవంతంగా ఉంటాయో ఆయన చర్య ద్వారా స్పష్టమైంది. మాజీమంత్రి ఇలా ప్రొటోకాల్ వాహనంలో పయనించడంతో అక్కడ ఉన్న భక్తులు ఇది పెద్దమార్పని, ఇలాంటి విధానాలు అందరూ విఐపిలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగవని పేర్కొన్నారు.