JAISW News Telugu

Champai Soren : బీజేపీలోకి చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్

Champai Soren

Champai Soren

Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మాజీ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. చంపై సోరెన్ కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హాజరయ్యారు.

కాగా, ఇటీవల చంపై సోరెన్ సొంత పార్టీ జేఎంఎంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు.

Exit mobile version