JAISW News Telugu

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.! కొన్నింటి నైసర్గీక స్వరూపాల మార్పు!

AP New Districts

AP New Districts

AP New Districts : ఆంధ్రప్రదేశ్ పాలనను చంద్రబాబు పట్టాలెక్కించారు. ప్రమాణ స్వీకారం చేసి పది రోజులు గడవకముందే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన నిర్ణయాలు తీసుకుంటూ పోతే.. తక్కువ సమయంలోనే ఏపీ దేశంలోనే నెం. 1 పొజిషన్ లో నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాలను గాడిలో పెట్టడం.. కొత్త జీవోలు తేవడం, తదితర సంచలన నిర్ణయాలు వేగంగా తీసుకంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు, నైసర్గిక స్వరూపాల మార్పు, నియోజకవర్గాల కూర్పు, తదితరాల గురించి ఆలోచిస్తున్నారు. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లాలను పెంచి వాటి సంఖ్యను 26 చేసింది. ఈ జిల్లాల్లో మొత్తం 679 మండలాలను ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు నాయుడు ఈ 26 జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం 32 జిల్లాలుగా మార్చాలని అనుకుంటున్నారు. ఆ మేరకు కేబినెట్ తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

అందులో.. 1. పలాస, 2. శ్రీకాకులం, 3. పార్వతీపురం, 4. విజయనగరం, 5. విశాఖపట్నం, 6. అరకు, 7. అనకాపల్లి, 8. కాకినాడ, 9. రాజమండ్రి, 10. అమలాపురం, 11. నరసాపురం, 12. ఏలూరు, 13. మచిలీపట్నం, 14. విజయవాడ, 15. అమరావతి, 16. గుంటూరు, 17. బాపట్ల, 18. నరసరావుపేట, 19. మార్కాపురం, 20. ఒంగోలు, 21. నెల్లూరు, 22. గూడూరు, 23. తిరుపతి, 24. చిత్తూరు, 25. మదనపల్లి, 26. హిందూపురం, 27. అనంతపురం, 28. ఆదోని, 29. కర్నూలు, 30. నంద్యాల, 31. కడప, 32. రాజంపేట ఉండబోతున్నాయి.

అయితే, గతంలో వివిధ జిల్లాలకు పెట్టి వ్యక్తుల పేర్లను ఈ సారి రాకుండా ప్రాంతాల విశిష్టతలను బట్టి మాత్రమే పేర్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. జిల్లాలు పెరిగితే పాలన మరింత చేరువవుతుందని, అందుకే కొత్త జిల్లాలలను తీుకువస్తున్నాట్లు చంద్రబాబు చెప్తున్నారని, వీటిపై అసెంబ్లీలో సైతం సుదీర్ఘ చర్చ జరిగి జీవో కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. 

Exit mobile version