Kiran Royal : కమీషన్ల కోసం శ్రీవారి ప్రసాదాన్ని కల్తీచేశారు : కిరణ్ రాయల్

 Kiran Royal

Kiran Royal

Kiran Royal : కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి లడ్డూల్లో నెయ్యి కల్తీపై ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ మాట్లాడారు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపించారు. అపవిత్రం చేసిన జగన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని చెప్పారు. తిరుమల ఆలయాన్ని, శ్రీవారి పోటును సంప్రోక్షణ చేయాలని కోరారు. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో మాజీ ఈవో ధర్మారెడ్డి కీలకమని అన్నారు. మాజీ ఛైర్మన్, టీటీడీ ఉన్నతాధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

TAGS