అయితే దీనికి సంక్షిప్త సమాధానం అవును అనే వస్తుంది. కానీ షరతులతో H1B వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే H4 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఆథరైజేషన్ (H4 EAD) ఆటోమేటిక్ కాదు.
వర్క్ ఆథరైజేషన్ కు అర్హత సాధించేందుకు H1B హోల్డర్ రెండు ప్రమాణాల్లో ఒకదాన్ని కలిగి ఉండాలి ఆమోదించబడిన I-140 (గ్రీన్ కార్డు ప్రక్రియలో భాగం) కలిగి ఉండాలి లేదంటే ఏసీ 21 నిబంధన కింద పొడిగించిన H1B హోదాలో ఉండాలి. ఏసీ21 నిబంధన ప్రకారం.. H1B హోల్డర్లు పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఉంటే సాధారణ 6 సంవత్సరాల పరిమితికి మించి ఉండవచ్చు.
ఈ షరతులు పాటిస్తే, H4 జీవిత భాగస్వామి H4 EAD కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది యజమాని సంబంధం అవసరం లేకుండా ఏ రంగంలోనైనా పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తుంది. H1B వీసా చెల్లుబాటు అయ్యేంత వరకు ఈ వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ H1B హోల్డర్ I-140ను రద్దు చేసినా, తిరస్కరించినా H4 EAD కూడా రద్దవుతుంది. H4కు మారి వర్క్ ఆథరైజేషన్ పొందాలనుకునేవారు H1B, గ్రీన్ కార్డు ప్రక్రియ పురోగతిని నిశితంగా పరిశీలించడం ముఖ్యం.