Ration card : రేషన్ కార్డు లేనివారికీ.. రైతు రుణమాఫీ
Ration card : తెలంగాణలో రుణమాఫీ కాలేదంటూ పలువురు రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో పేర్లు తేడాగా ఉండడంతో చాలా మందికి మాఫీ కావడం లేదు. రేషన్ కార్డు లేనివారికి పూర్తిగా కావడం లేదు. అలాంటి వారికి గ్రామ పంచాయతీలో కమిటీల ద్వారా త్వరలోనే కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. ఇందుకోసం కొంత సమయం పడుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి. వారిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగనివ్వమని సీఎం తెలిపారు.