Tribal Baby Dolls : వైద్య సేవల కోసం.. డోలీలో గిరిజన బాలింత పాట్లు
Tribal Baby Dolls : వైద్య సేవలు పొందేందుకు ఆదివాసీ గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా ఓ బాలింత తన పసిగుడ్డుతో ఆస్పత్రికి వెళ్లడానికి గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి జిల్లా అర్ల పంచాయతీ శివారు పిత్రిగెడ్డ గ్రామానికి చెందిన గర్భిణి కొర్రా దేవి (29)కి బుధవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రాగా, ఇంటి వద్ద బిడ్డకు జన్మనిచ్చింది. పసిబిడ్డను, బాలింతను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఈ గూడెం నుంచి సరైన దారిలేదు. దీంతో గురువారం వేకువజామున దేవి భర్త రమేశ్, పమీప బంధువు రాజు తల్లీబిడ్డను పిత్రిగెడ్డ నుంచి అర్ల వరకు ఆరు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకువచ్చారు. అక్కడికి వచ్చాక, 108కి ఫోన్ చేసినా అది రాలేదు. దీంతో చివరకు వారు అర్ల నుంచి బుచ్చెంపేట ఆస్పత్రికి ఆటోలో బాలింతను, పసిబిడ్డను తరలించారు.