Huge Bangla people in Indian Border : భారత దేశంలో ఆశ్రయం పొందేందుకు బంగ్లా దేశీయులు సరిహద్దుకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు అక్కడ అదుపులోకి రాలేదు. కొన్ని వర్గాలకు చెందిన సంస్థలు, వ్యాపార సముదాయాలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆశ్రయం కల్పించాలని కోరుతూ అనేక మంది భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. అందులో భాగంగా పశ్చిమబెంగాల్ లోని జల్ పాయిగుడీ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు వందలాది మంది బంగ్లాదేశీయులు బారులు తీరినట్లు వెల్లడైంది.
మరోవైపు, పొరుగు దేశంలో హింస చెలరేగడంతో భారత్ అప్రమత్తమైంది. 4,096 కి.మీ. పొడవైన ఆ దేశంతో ఉన్న సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి కూడా సరిహద్దుల్లోని జిల్లాకు చేరుకొని అధికారులతో సమావేశమై సమీక్షించారు.