Per Week 120 Crores Income : కోట్లాది మంది లాటరీ టికెట్ కొంటే ఒక్కరికే తగులుతుంది. దీన్ని ఏమనుకోవాలి అదృష్ట్యమనే కదా. కష్టపడి పని చేస్తే మాత్రం దీర్ఘకాలికంగా ఫలితాలు ఉంటాయేమో గానీ.. అంత ఓపిక ఇప్పటి జనరేషన్ కు అస్సలు లేదు. వరి వేశామా.. అన్నం ప్లేట్ లోకి వచ్చి చేరాలనుకుంటున్నారు. ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక్కోసారి ఇది కూడా లక్కుగా కలిసి వస్తుందేమో. ఇక్కడ ఒక యువతి చేస్తున్న పనికి కోట్లల్లో సంపాదిస్తుంది. అదెలాగంటారా?
వారిలో ఉన్న టాలెంట్ ను బట్టి సంపాదన మార్గం ఎంచుకుంటారు. ఇప్పటి జనరేషన్ అయితే డబ్బు సంపాదనకు సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతుంది. అందులో యూ ట్యూబ్, ఇన్ స్టా ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సాలరీల కన్నా డబుల్, త్రిబుల్, ఒక్కోసారి వందల రేట్లు సంపాదిస్తున్నారు. వారిలోని టాలెంట్ ను వీడియోల రూపంలో యూ ట్యూబ్, ఇన్ స్టా వేదికన అప్ లోడ్ చేసి ఫాలోవర్స్ ను సంపాదించుకొని.. భారీగా వెనకేసుకుంటున్నారు. రీసెంట్ గా చైనీస్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయంజర్ జెంగ్ జియాంగ్ అనే యువతి ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చంది. ఈమె ప్రతిభతో సోషల్ మీడియానే ఆశ్చర్యపరుస్తుంది.
చైనీస్ వెర్షన్ టిక్ టాక్ లో 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌తో రికార్డ్ సృష్టించింది. తక్కువ సమయంలో ప్రొడక్ట్ ప్రచారం చేసేందుకు అద్భుతమైన ఇంటలిజెన్స్ ఉపయోగించింది. చాలా మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయంజర్స్ వారు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ వివరాలను 3 నుంచి 4 నిమిషాలైనా వివరిస్తారు. కానీ జెంగ్ ప్రొడక్ట్ గురించి చెప్పేందుకు కేవలం 3 సెకన్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. అంత తక్కువ సమయంలో ప్రొడక్ట్ విలువ చెప్పేస్తుంది. ఇలా ఆమె లైవ్ ప్రసారాల ద్వారా భారీగా సంపాదిస్తుంది.
జెంగ్ మిల్లీ సెకన్ల వ్యవధిలో, ప్రతీ ప్రొడక్ట్‌ను ఎంచుకొని, కెమెరాకు చూపించి, దాని ధర అర్థమయ్యేలా చేస్తుంది. ఇదంతా కేవలం 3 సెకన్లలో జరిగిపోతుంది. ఇంత తక్కువ సెకన్లలో తన ఫాలోవర్స్ ను కట్టిపడేసే సామర్థ్యం జెంగ్ సొంతం. ఇదే ఆమె ఆదాయ వనరుగా మారింది. ప్రతీ వారం నమ్మశక్యం కాని $14 మిలియన్ (రూ. 120 కోట్లు) సంపాదిస్తున్నట్లు జెంగ్ తెలిపింది. ఈ యువతి తెలివికి నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.