Kangana Ranaut : జానపద కళలు అంతరిస్తున్నాయి.. లోక్ సభలో కంగన తొలి ప్రసంగం

Kangana Ranaut
Kangana Ranaut : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్ సభలో తొలిసారి ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె.. తమ రాష్ట్రంలో గిరిజన సంగీతం, జానపద కళలు అంతరించిపోతున్నాయని అన్నారు. సభలో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మండి ప్రజల తరపున మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కంగన స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కంగన మాట్లాడారు.
మండిలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపారు. హిమాచల్ లో కత్-కుని అనే హస్తకళ ఉంది. గొర్రె చర్మాన్ని జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తుల తయారీకి వినియోగిస్తారని, వీటికి విదేశాల్లో ఎంతో విలువ ఉన్నా.. ఇక్కడ మాత్రం అంతరించి పోతున్నాయని తెలిపారు. వీటికి ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోవడానికి చర్చించాల్సిన అవసరముందన్నారు. హిమాచల్ లో జానపద సంగీతం, మరీ ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మౌర్ లోని గిరిజన సంగీతం, వారి జానపదం, కళారూపాలు కూడా అంతరించిపోతున్నాయని ప్రసంగంలో పేర్కొన్నారు.