JAISW News Telugu

Flying taxi : బెంగళూరు సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ఫ్లైయింగ్ టాక్సీ.. ఛార్జీ కూడా చౌకే

Flying taxi

Flying taxi

Flying taxi : చాలా చోట్ల విమానాశ్రయాలు నగరానికి దూరంగా నిర్మించబడ్డాయి. దీని వల్ల ప్రజలు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.  ఎయిర్ పోర్టుకు వెళ్లాలనుకునే వారు ఇకపై ఇ-ఫ్లయింగ్ టాక్సీ బుక్ చేసుకోవచ్చు.  బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) నుండి 40 కి.మీ దూరంలో ఉన్న కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)కి ఇ-ఫ్లయింగ్ టాక్సీలు త్వరలో ప్రారంభించబడతాయి. ఇందుకు  ఛార్జీ రూ.1,700గా నిర్ణయించారు.

ఇందుకోసం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్), సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. BIAL ఈ విషయాన్ని Xలో ధృవీకరించింది.  ఏడు సీట్ల ఫ్లైయింట్ ట్యాక్సీలను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది విమాన ప్రయాణ సౌలభ్యంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడమే వీరి లక్ష్యం.

Exit mobile version