Flours To Eat : మైదాకు బదులు ఏ పిండి వాడండి..

Flours To Eat

Flours To Eat

Flours To Eat  : ఈ రోజుల్లో చాలా మంది మైదా పిండికి ఆకర్షితులవుతున్నారు. దీంతో చాలా రకాల అనారోగ్యాలు దరిచేరే అవకాశాలున్నాయి. మైదాను ఎక్కువగా బేకరీ ఫుడ్స్ లో వాడుతున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు, ఫిజాలు, బర్గర్లు వంటివి ఈ పిండితోనే తయారు చేస్తుంటారు. డబుల్ ఫిల్టర్ కావడంతో దీంతో మనకు అనారోగ్యాలు దరిచేరడం జరుగుతుంది. ఈనేపథ్యంలో మైదాకు బదులు ఇతర పిండి వాడితే మన ఆరోగ్యం నియంత్రణలో ఉంటుందని తెలుసుకోవాలి.

శనగపిండిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ,సి, బి6, ఫొలేట్, నియాసిన్, థైమీన్, మాంగనీసు, పాస్పరస్, ఐరన్, కాపర్ లాంటికి అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. పొట్టలో చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

క్వినోవా పిండిలో తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మెగ్నిషియం, కాపర్ వంటి మినరల్స్ లభిస్తాయి. ఎముక ఆరోగ్యానికి జీవక్రియల మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు.

బ్రౌన్ రైస్ కూడా మంచి ఆహారమే. ఇందులో కూడా మెగ్నిషియం, పాస్పరస్ విటమిన్ బి వంటి పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియలో సహాయంగా ఉంటుంది. బాదం పిండిలో కూడా ఆరోగ్యమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇలా మైదాకు బదులు వీటి పిండి తినడం ఎంతో మేలు.

TAGS