Kaziranga National Park : అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మంది ఈ వరద బారినపడ్డారు. ఈ వరదల వల్ల అక్కడి కజిరం నేషనల్ పార్క్ లోని 129 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందినవాటిలో 6 ఖడ్గమృగాలు, 100 హాగ్ జింకలు, రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని హాగ్ జింకలు, ఖడ్గమృగాలు, సాంబార్ సహా 96 వన్యప్రాణులను రక్షించారు. కాగా, 2017 సంవత్సరంలో సంభవించిన భారీ వరదలకు ఈ పార్క్ లోని 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి.
ఈ ఏడాది వరదలకు రాష్ట్రంలో 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కమ్రూప్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపానుల కారణంగా ఇప్పటి వరకు 64 మంది మరణించారు.