Flood in Vijayawada : విజయవాడలో మళ్లీ వరదల పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్ నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, రూరల్ లో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లో ఒక అడుగు నుంచి రెండు అడుగుల మేర వరద పెరగడంతో అధికారులు అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి అవసరమైన ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు (శనివారం) ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడిి మత్స్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.