JAISW News Telugu

Flood aid : వరద సాయం: ఏపీకి రూ.1036 కోట్లు.. తెలంగాణకు ఎన్ని కోట్లు అంటే?

Flood aid : నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని, ఇందులో ఎక్కువ భాగం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ వరద సాయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే చెప్పాలి. త్వరలో ఎన్నికలు ఉన్న మహారాష్ట్రకు రూ.1492 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.1036 కోట్లు మాత్రమే ముట్టజెప్పింది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీకి 6వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని నివేదికలు పంపినా కేంద్రం కేవలం 1000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.

ఇక ఏపీతోపాటు అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు తదితరాలు విడుదలయ్యాయి.

పక్కనున్న తెలంగాణ కు కేంద్రం కేవలం రూ.416.80 కోట్లు విడుదల చేసి షాకిచ్చింది. . వరద సాయం అందనున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, మిజోరంకు 21.60 కోట్లు, మిజోరంకు 19.20 కోట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడి నష్టపోయాయి.

Exit mobile version