Cricket Fans Hurddles : ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023కి అహ్మదాబాద్ సిద్ధం అవుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ నెల 19న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా హోరా హోరీగా తలపడనున్నాయి. అయితే ఫైనల్ చూసేందుకు భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు ఎక్కువ మంది అహ్మదాబాద్ చేరుకున్నారు. దీంతో పట్టణంలో రద్దీ విపరీతంగా పెరిగింది.
షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే భారతీయులతో పాటు వరల్డ్ వైడ్ గా చాలా మంది అహ్మదాబాద్ లో హోటళ్లలో రూములను బుక్ చేసుకున్నారు. మిగిలిన కొన్ని గదులను హోటల్ నిర్వాహకులు అధిక మొత్తానికి అద్దెకు ఇస్తున్నారు. ఒక్క రోజు అద్దె రూ. 24,000 నుంచి రూ. 2,15,000 వరకు పెరగడంతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కేవలం రూ. 10 వేలు ఉన్న గదులు ఇప్పుడు రూ. 2 లక్షలకు పైగానే అద్దెను డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కూడా నరేంద్రమోడీ స్టేడియంలోనేజరిగింది. ఆ సమయంలో కూడా ఇక్కడ హోటళ్లలో అద్దెలు, రేట్లను విపరీతంగా పెంచారు నిర్వాహకులు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ను కూడా ఇంతకంటే విపరీతమైన రేట్లను భరించాల్సి వస్తుందని క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇదే విధంగా విమాన సేవలకు కూడా ధరలు విపరీతంగా పెరిగాయి. నెల క్రితం నుంచి రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్ల ధర 200% నుండి 300% వరకు పెరిగినట్లు గూగుల్ డేటా సూచించింది. నవంబరు 18న ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు విమాన టిక్కెట్ల ధర ఇప్పుడు రూ.15,000 పైమాటే. క్రికెట్ ఫైనల్ మాట దేవుడెరుగు ఈ ధరలతో అహ్మదాబాద్ ఆనంద పడుతుందని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.