Liquor shop lottery : మద్యం షాపుల లాటరీలో ఒక్కరికే ఐదు షాపులు
liquor shop lottery : ఏపీలో మద్యం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం ఇటీ వల తీసుకొచ్చిన మద్యం పాలసీకి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 26 జిల్లాల పరిధిలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల నుంచి లాటరీ విధానంతో షాపుల కేటాయింపు జరుగుతోంది. బందోబస్తు నడుమ నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ ఎన్నికలను తలపించింది.
ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. కాగా లాటరీలో కొందరి పంట పండింది. లాటరీలో అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఈరోజు పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4, ధర్మవరం రూరల్ లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ దుకాణాలు ఆయనకు దక్కాయి. ఒక్కరికే ఐదు దుకాణాలు దక్కడం గమనార్హం.