Congress : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందడం విశేషం.
కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రాఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్ చార్జి పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి(నాగర్ కర్నూల్), కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), బలరాం నాయక్ (మహబూబాబాద్), కొందురు రఘువీర్ రెడ్డి (నల్గొండ), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.