JAISW News Telugu

Kaleshwaram Project : ముందు అధికారులు.. ఆ తరువాతే కేసీఆర్, హరీష్  

Kaleshwaram Project

Kaleshwaram Project

Kaleshwaram Project : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్మించారు. ఇప్పుడా కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన అధికారులను ఇరుకున పెట్టబోతున్నారా?  లేదా మాజీ సీఎం కేసీఆర్ తోపాటు మాజీ మంత్రి హరీష్ రావు  టార్గెట్ చేస్తారా అనే  అనుమానాలు అవుతున్నాయి. ఎన్నికలకు ముందే ప్రాజెక్ట్ లో లోపాలు బహిర్గతం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణం, ఖర్చు తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం విచారణకు  ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టింది. గురువారం రాష్టంలో అడుగుపెట్టిన కమిషన్ ను మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. కమిషన్ సభ్యులు మంత్రి తోపాటు సంబంధిత శాఖ అధికారులతో సమావేశమమయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం పై ఇంజినీర్లు కమిషన్ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను కమిషన్ సభ్యులు సేకరించారు.  

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశాలను ఎంత తొందరగా ప్రభుత్వానికి అందజేస్తే అంత బాగుంటదని జస్టిస్ చంద్ర ఘోష్ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా ఎవరికీ నోటీసులు జారీచేయాలని  కమిషన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తరువాత సంబంధిత మంత్రిగా బాధ్యతల్లో ఉన్న హరీష్ రావు కు  కమిషన్ ముందుగా నోటీసు ఇవ్వనున్నట్టు సమాచారం. ముఖ్య మంత్రి‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో కేసీఆర్ భారీ నీటిపారుదల శాఖ‌ను తన వద్దే పెట్టుకున్నారు. కాబట్టి హరీష్ రావు కంటే ముందుగానే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై పలువురు రాజ్యాంగ నిపుణులు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరినీ పక్కకుపెట్టి ముందుగా సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.  ముందుగా అధికారుల నుంచి వివరణ తీసుకున్న తరువాతే  ఆ ఇద్దరిలో ఎవరికీ నోటీసు ఇవ్వాలనే దానిపై  కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇద్దరికీ నోటీసు ఇచ్చే విషయాన్నీ లోతుగా ఆలోచించే కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికిప్పుడు కేసీఆర్ తోపాటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తున్నది.  ముందుగా సంబంధిత ఇంజినీర్లకు నోటీసు ఇచ్చిన తర్వాతే సరైన నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందనే  అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం విశేషం.

Exit mobile version