JAISW News Telugu

First Review : ఫస్ట్ రివ్యూ : డిఫరెన్స్ కాన్సెప్ట్ తో ‘బ్యాడ్ న్యూజ్’

First Review

First Review

First Review Bad Newz : ఓటీటీ రాకతో నార్త్ ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి. గతంలో పెద్ద హీరోల సినిమాలు ఎలా ఉన్నా చూసే వారు. ఆ బడా హీరోల సినిమాలే హిట్టయ్యేవి. కొత్త హీరోలు తెరమీదకు వచ్చినా నిలదొక్కుకున్నది తక్కువే. ఓటీటీల ప్రవేశంతో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలు బోల్తా కొట్టగా, కొత్త హీరోలు, లేడీ ఓరియెంట్ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచి రూ. వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి.

ఈ కోవలో మరో లో బడ్జెట్ చిత్రం రాబోతున్నది. తెలుగు దర్శకుడు సందీప్ వంగా రూపొందించిన యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌ గా నిలిచింది త్రిప్తి డిమ్రీ. తాజాగా ఆమె  నటించిన మరో చిత్రం తాజా చిత్రంబ్యాడ్ న్యూజ్. రొమాంటిక్ కామెడీ జానర్ లో  రూపొందిన ఈ సినిమాలో వికీ కౌశల్, ఆమీ విర్క్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలకు ముందే హాట్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిచాయి. ఆనంద్ తివారీ దర్శకుడు. కరణ్ జోహర్, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ నిర్మాతలుగా వ్యవహరించారు. జూలై 19న రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా క్రిటిక్ రివ్యూలోకి వెళితే..

సలోని బగ్గా (త్రిప్తి డిమ్రి) ఒకే రాత్రి అఖిల్ చద్దా (వికీ కౌశల్), గుర్బీర్ పన్ను (ఆమీ విర్క్) తో రోమాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. డాక్టర్ చెకప్ లో ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని తెలుస్తుంది. అయితే ఇద్దరు పురుషుల ద్వారా ఇద్దరు బిడ్డలు రాబోతున్నారు. హెటెరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ అనే అరుదైన ప్రక్రియ కారణంగా ఇలా జరుగుతుందని డాక్టర్ చెబుతుంది.

ఈ అరుదైన ప్రక్రియ ఏమిటి? కవల పిల్లలు పుట్టబోతున్నారనే విషయం తెలిసిన తర్వాత సలోని పరిస్థితి ఏమిటి? ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులనే విషయంలో  అసలు ఏం జరిగింది? ఒకే గర్భంలో ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులా? అనే ప్రశ్నలకు సమాధానం ఏమిటి? తర్వాత జరిగిన పరిణామాలేంటనేదే ఈ సినిమా కథ.

Exit mobile version