South Industry Movies : ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ మీద భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని మాత్రమే అని చెప్పుకునే వారు. వంద కోట్లు, 200 కోట్లు … ఇలా వెయ్యి కోట్ల కలెక్షన్లు అంటూ బాలీవుడ్ సినిమాలు మాత్రమే లెక్కలోకి తీసుకునే వారు. దాదాపు ఆరేడేళ్లుగా పరిస్థితులు మారాయి. సౌత్ సినిమా బాలీవుడ్ ను శాసిస్తున్నది. హిట్టు సినిమాలైనా, భారీ బడ్జెట్ అయినా, కంటెంట్ పరంగా చూసకున్నా సౌత్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం 2024 మొదటి మూడు నెలల్లో సక్సెస్ రేట్ సౌత్ సినిమాలదే ఎక్కువగా కనిపిస్తున్నది. 2023 ఇయర్ ఎండింగ్ సలార్ మూవీతో ప్రభాస్ బాలీవుడ్ లెక్కలను తిరగరాశాడు. 2024 మొదటి క్వార్టర్ లోనూ సౌత్ సినిమాలే పై చేయి సాధించాయి. ఇందులో మలయాళ సినిమాలు మరింత డామినేషన్ చూపపుతున్నాయి.
సౌత్ నుంచి రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్, హనుమాన్, చామికిల, ఆవేశం, బ్రమయుగం, ప్రేమలు, టిల్లు స్క్వేర్, లాపటా లేడీస్, మైదాన్, భక్షక్, అన్వేషిప్పిన్ కందెతుమ్, ఇంకా ఈ సంవత్సరం అత్యుత్తమ చిత్రాలలో ఉన్నాయి. నిజంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ అత్యుత్తమ చిత్రాల్లో సగానికి పైగా ఉన్నవి మలయాళ సినిమాలే. ఇది అసాధారణమైన విజయాలను నమోదు చేశాయి. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.
డబ్బింగ్ లోనూ పైచేయి..
మలయాళ చిత్రాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో రిలీజై ఇక్కడా హిట్ అయ్యాయి. టాలీవుడ్ హనుమాన్, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇది విమర్శకుల ప్రశంసలను పొందడమే కాకుండా కమర్షియల్ గా అనూహ్య విజయాన్ని సాధించాయి., వరుసగా 300చ 100 కోట్ల కలెక్షన్లు దాయి. బాలీవుడ్‌లో లాపటా లేడీస్, మైదాన్ తో పాటు కొన్ని ఇతర చిత్రాలు కంటెంట్ పరంగా అత్యుత్తమంగా నిలిచాయి. కానీ ఏదీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టలేకపోయాయి.
భక్షక్, చమ్కిలా చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హిట్లుగా నిలిచాయి. అయితే మొదటి క్వార్టర్ తమిళ చలనచిత్ర పరిశ్రమ ఇప్పటివరకు ఎలాంటి మ్యాజిక్ చేయలేపోయింది. లాల్ సలామ్, అయాలాన్, కెప్టెన్ మిల్లర్, సైరన్ వంటి భారీ అంచనాలు ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా నిలబడలేకపోయాయి. విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.