MLA Shankar: మొదటి నెల జీతం రూ. 1.5 లక్షల ను పెన్షనర్స్ ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్

రంగారెడ్డి జిల్లా:  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఔన్నత్యాన్ని చాటారు. తన మొదటి నెల వేతనాన్ని షాద్ నగర్ తాలూకా రిటైర్డ్ ఉద్యోగ స్తుల పెన్షనర్స్ సంఘానికి ఇస్తానని హామీ ఇచ్చిన విధంగానే శనివారం ఉదయం సదరు సంఘం నాయకులు సరాపు జగదీశ్వర్, రామారావు, జనా ర్ధన్ తదితరుల చేతుల మీదుగా 1,50,000 చెక్కు అందజేశారు.

సంక్షేమ సంఘానికి తన వంతు కృషిగా డబ్బులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన త ర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ తరపున తనకు సన్మానం చేసిన రోజు సంఘం కష్ట నష్టాలను వినడం జరిగిందని, వెంటనే వారికి తన వేతనంలో డబ్బు ఇస్తానని చెప్పినట్టు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ఉద్యోగులు అభినందించి సన్మానించారు..

TAGS