JAISW News Telugu

Hyderabad : కొత్త చట్టాల కింద హైదరాబాద్ లో తొలి కేసు నమోదు

Hyderabad

Hyderabad

Hyderabad : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు నేటి నుంచి (జులై 1) అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే కేసులు నమోదవుతున్నాయి. అంటే ప్రజలు ఏ మేరకు చట్ట వ్యతిరేక కలాపాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నమోదైంది. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై కొత్త చట్టం కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ డిజిటల్ గా నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన ప్రకారం.. చార్మినార్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెళుతున్న నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని గుర్తించారు. వీరిలో ఒకరు గిల్ వర్కర్ కాగా, మరొకరు హోటల్ వర్కర్ వీరు ఇంటికి వెళుతున్నారు. బీఎన్ఎస్ చట్టం కింద నోటీసులు జారీ చేశామని విచారణ జరుగుతోందని తెలిపారు.

Exit mobile version