Fireworks explosion : కేరళ కాసర్ గోడ్ లోని ఓ ఆలయంలో బాణసంచా పేలిన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళ ఫెస్టివల్ సందర్భంగా బాణసంచా నిల్వలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దహనం ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. నీలేశ్వరం సమీపంలోని ఓ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని కాసరగోడ్, కన్నూర్, మంగళూరులోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సహా జిల్లా అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వెంటనే అగ్నిమాపక వాహనాలను రప్పించారు. చాలా శ్రమ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. వీరకవు దేవాలయం సమీపంలోని ఓ దుకాణంలో బాణసంచా ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.