
Fireworks
Fireworks : దీపావళి పండగ పూట ఏలూరులో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు తూర్పువీధిలో బాణసంచా తీసుకెళ్తుండగా పేలి ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేలుడు ధాటికి మృతుడి శరీరం ఛిద్రమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.