Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కార్చిచ్చు.. కాలి బూడిదవుతున్న వన్యప్రాణులు
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లా అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది. నిన్నటి నుంచి ఇంకా కిలోమీటర్ల మేర అడవులు కాలిపోతూనే ఉన్నాయి. చింగూస్ బ్లాక్ సహా నౌషెరా సబ్ డివిజన్ ఫారెస్టులో ఈ మంటలు అంటుకున్నాయి. మంటల కారణంగా స్థానిక గ్రామాల్లోకి దట్టమైన పొగ చేరుతోంది. దీంతో స్థానికులు, పిల్లలు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మంటల్లో జంతువులు, పక్షులు కాలి బూడిదవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఇప్పటికే ఎండలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఆ ఎండలకు తోడు, ఈ మంటలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.