JAISW News Telugu

Fire in medical college : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం

Fire in medical college

Fire in medical college

Fire in medical college : యూపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, అస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా అస్పత్రికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. కాగా, ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు చికిత్స అందిస్తామని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజుశ్ పాఠక్, ఆరోగ్యశాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరారు.

Exit mobile version