JAISW News Telugu

Air India Express : ఎయిరిండియా విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India Express

Air India Express

Air India Express : బెంగళూరు నుంచి కొచ్చికి బయల్డేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అందులో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరులో టెకాష్ అయిన కొద్ది సేపటికే సిబ్బంది మంటల్ని గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారమిచ్చారు. దీంతో ఎయిర్ పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11.12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండయ్యింది.

మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తూనే సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఎట్టకేలకు రన్ వే పై క్రాష్  ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అపటికే సిద్ధంగా ఉన్న ఫైరింజన్తు మంటలను ఆర్పాయి. ప్రయాణికులను బస్సులలో రన్ వే నుంచి ఎయిర్ పోర్టు లోపలికి తీసుకువెళ్లారు. జరిగిన ఘటనపై ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విచారం వ్యక్తం చేసింది. నియంత్రణా సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.

Exit mobile version