SRH players : పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం: బయటపడ్డ SRH ఆటగాళ్లు
SRH players : హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ పార్క్ హయత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో కొంతసేపు భయాందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో SRH జట్టు హోటల్‌లోనే బస చేస్తోంది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా పొగలు రావడంతో సిబ్బందితో పాటు హోటల్‌లో ఉన్న అతిథులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హోటల్ ఆరో అంతస్తులో ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే SRH జట్టు సభ్యులు ఎలాంటి ఆలస్యం చేయకుండా హోటల్ నుంచి సురక్షితంగా బయటికి వెళ్లిపోయారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పార్క్ హయత్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ SRH ప్లేయర్స్
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో బస చేస్తున్న ఆటగాళ్లు
హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో భయాందోళనకు గురైన సిబ్బంది, అతిథులు
ప్రమాద సమయంలో 6వ అంతస్తులో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లు
వెంటనే హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయిన… https://t.co/fEXwwWOVZj pic.twitter.com/AGbac2fcAm
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025