Fire accidents : హైదరాబాద్ లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు

Fire accidents
Fire accidents : హైదరాబాద్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నగరంలోని ఆరాంఘర్ లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహింద్రా షోరూం వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంఎం పహాడిలోని స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.