Virat Kohli Pub : విరాట్ పబ్ పై ఎఫ్ఐఆర్.. ఎందుకో తెలుసా?

Virat Kohli Pub

Virat Kohli Pub

Virat Kohli Pub : స్టార్‌ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లికి చెందిన పబ్‌పై బెంగళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కొనసాగిస్తుండడంతో పోలీసులు సీరియస్ గా వ్యవహరించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లికి చెందిన ‘వన్‌8 కమ్యూన్‌’తో పాటు మరికొన్ని పబ్‌లు ఉన్నాయి. అయితే ఇవన్నీ నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా తమ కార్యకలాపాలను  కొనసాగిస్తున్నాయి. ప్రతీ రోజూ ఇదే తంతు కొనసాగుతుందని స్థానికులు, బాటసారులు పోలీసులకు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద పెద్ద శబ్దంతో సంగీతం వినిపిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే పబ్ లకు అనుమతి. ఆ తర్వాత కూడా తెరిచే ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని నిబంధనలు ఉన్నాయి. ‘దీనిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు. ప్రస్తుతం ‘వన్‌8 కమ్యూన్‌’ మేనేజర్‌పై కేసు నమోదైంది.

విరాట్ కొహ్లి రెస్టారెంట్, పబ్ బిజినెస్ లోకి వచ్చాడు. ఇందులో భాగంగా వన్ 8 కమ్యూన్ పేరుతో దేశంలోని మెట్రోపాలిటిన్ తో పాటు వివిధ పెద్ద పట్టణాల్లో రెస్టారెంట్లు, పబ్ లను ఓపెన్ చేస్తున్నాడు. బెంగళూర్ తో పాటు ఇతర మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబై, పూణె, కోల్‌కతాలో కూడా ‘వన్‌8 కమ్యూన్‌’ బ్రాంచ్‌లు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన పబ్‌ను గతేడాది డిసెంబర్‌లో విరాట్ కొహ్లీ ప్రారంభించారు. కస్తూర్బా రోడ్డులో ఉన్న దీని నుంచి సమీపంలో ఉన్న కబ్బన్‌ పార్క్‌, చిన్నస్వామి స్టేడియంను వీక్షించవచ్చు.

TAGS