JAISW News Telugu

Cancer Patients : క్యాన్సర్ రోగులకు మోడీ రూ.15 లక్షల సాయం.. ఇలా అప్లై చేయండి

Cancer Patients : దేశంలో అత్యంత ప్రమాదకరమైన జబ్బు క్యాన్సర్. దీంతో దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స లేని వ్యాధి క్యాన్సర్. దీనికి మందు లేదు. ప్రపంచంలో మందు లేని వ్యాధులు రెండే. ఒకటి ఎయిడ్స్, రెండు క్యాన్సర్. ప్రస్తుతం ఎయిడ్స్ నియంత్రణలోకి వచ్చినా క్యాన్సర్ మాత్రం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే మన ప్రాణాలు గల్లంతు కావడం ఖాయం.

కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ రోగుల కోసం ఆర్థిక సాయం అందించేందుకు ఓ పథకం ప్రారంభించిన సంగతి చాలా మందికి తెలియదు. క్యాన్సర్ రోగులు చికిత్స చేసుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకంతో వారికి లబ్ధి చేకూరుతుంది. వారికి మందులు అందించేందుకు సంకల్పించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకం గురించి ఎవరికి తెలియదు. దీంతో ఇక్కడ నుంచి క్యాన్సర్ బాధితులు ఈ పథకం గురించి దరఖాస్తు చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కొందరు ఈ పథకం వినియోగించుకున్నారు.

తెలంగాణ నుంచి మాత్రం క్యాన్సర్ రోగులు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈనేపథ్యంలో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. క్యాన్సర్ గురించి ముందస్తు అవగాహన లేకపోవడంతో ఎవరు కూడా ఆర్థిక సాయం పొందిన దాఖలాలు లేవని తెలుస్తోంది. కేంద్రం దీని గురించి సరైన అవగాహన కల్పించి వారికి చేయూత అందించాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రపంచంలో గుండెపోటు తరువాత ఎక్కువగా చనిపోయే వారి సంఖ్య క్యాన్సర్ లోనే ఎక్కువగా ఉంటోంది. దీని గురించి ఎవరికి తెలియకపోవడంతో 2009 లో కేంద్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఫండ్ అనే పథకం ప్రారంభించింది. 27 రకాల క్యాన్సర్ జబ్బులను చేర్చింది. పేద వారికి ఈ పథకం వర్తింప చేస్తుంది. క్యాన్సర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఇందులో ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను వినియోగించుకుంటున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది.

ఈ రోగులకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఇలా క్యాన్సర్ రోగులకు తెలియకపోవడంతో చాలా మంది ఈ అవకాశాన్ని దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా దీని గురించి తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని ఉపయోగించుకుని క్యాన్సర్ రోగులు ప్రయోజనం పొందాలని సూచిస్తున్నారు.

Exit mobile version