UPI transactions : యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన

UPI transactions
UPI transactions : కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించనున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రూ.2000కు పైబడి చేసే డిజిటల్ చెల్లింపులకు జీఎస్టీ వర్తిస్తుందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఖండించింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి జీఎస్టీ పరిశీలనలో లేదని పేర్కొంటూ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించింది. అలాగే, చిన్న వ్యాపారులను ఉద్దేశించి యూపీఐ ప్రోత్సాహక పథకాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ రూ.1500 కోట్ల నిధులు కేటాయించినట్టు వెల్లడించింది.