Telangana : తెలంగాణలో సినిమా ప్రదర్శనలు నిలిపివేత

Telangana

Telangana

Telangana : తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు థియేటర్ల నిర్వాహకులు తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం ఎక్కువ వస్తోందని తెలిపాయి. దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు.

సాధారణంగా సమ్మర్ లో సినిమాలు ఎక్కువగా విడుదల చేస్తారు. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను సమ్మర్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమ్మర్ హాలీడేస్ ఉంటాయి కాబట్టి స్కూల్, కాలేజీ పిల్లలతో పాటు, పేరెంట్స్ కూడా సినిమాలకు వస్తారని  అంతా భావిస్తారు. కానీ ఈ సీజన్ లో ఎన్నికలు, మరోపక్క ఐపీఎల్ ఉండడంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితకా సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవ్వరూ రావట్లేదు. ఓ పదిమంది వచ్చినా ఆ కలెక్షన్స్ కరెంట్, రెంట్ లకు కూడా రావట్లేదు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీ నష్టాల్లో ఉన్నాయని సమాచారం.

TAGS