Fighter Collections : ‘ఫైటర్’ మొదటి రోజు వసూళ్లు..సత్తా చాటిన హృతిక్ రోషన్!
Fighter Collections : హృతిక్ రోషన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫైటర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాకి హైప్ అనుకున్న రేంజ్ లో జెనెరేట్ అవ్వలేదు. హైప్ లేని ప్రభావం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పైన బలంగానే పడింది . కానీ ఎప్పుడైతే టాక్ వచ్చిందో, అప్పటి నుండి ఈ సినిమాకి బుకింగ్స్ వేరే లెవెల్ కి చేరుకుంది.
మ్యాట్నీ నుండి పికప్ అందుకున్న కలెక్షన్స్ ని చూసి ట్రేడ్ పండితులు మొదటి రోజు కచ్చితంగా 20 నుండి 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి మొదటి రోజు పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కూడా వసూళ్లు అదిరిపోయాయి. ఈ సినిమాకి టాక్ బాగా రావడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హృతిక్ రోషన్ ఫ్యాన్స్, తెలుగు లో ఈ సినిమా విడుదల అవ్వనందుకు ఫీల్ అయ్యారు.
ఇక టాక్ ప్రభావం రెండవ రోజు సినిమా పై ఒక రేంజ్ లో పడింది. దానికి తగ్గట్టు నేడు రిపబ్లిక్ డే అవ్వడం, సినిమా కూడా దేశభక్తి జానర్ కి సంబంధించినది అవ్వడం తో ప్రేక్షకులు థియేటర్స్ కి ఒక రేంజ్ లో క్యూ కట్టారు. బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి గంటకి 50 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయట. గత ఏడాది నుండి ఇప్పటి వరకు విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలలో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాలలో ఒకటిగా ‘ఫైటర్’ చిత్రం నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి కచ్చితంగా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తుందట.
అంటే మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే రెండింతలు ఎక్కువ వసూళ్లు రాబోతున్నాయి అన్నమాట. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలకు టాక్ వస్తే, కలెక్షన్స్ పరంగా ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి అనడానికి ‘ఫైటర్’ చిత్రం ఒక ఉదాహరణగా నిల్చింది. ఇదే ఊపు ని మరో నాలుగు రోజులు కొనసాగిస్తే కచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.