Peddireddy vs Roja : జగన్ కు అత్యంత సన్నిహితులు పెద్దిరెడ్డి. జగన్ తన తర్వాత పార్టీ బాధ్యతను మొత్తం పెద్దిరెడ్డిపైనే పెట్టారు. ఇక జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనకు ఆర్థికంగా నైతికంగా పెద్దిరెడ్డి అండగా నిలబడ్డారు. పార్టీని నిలబెట్టారు. అందుకే పెద్దిరెడ్డికి జగన్ అంతగా విలువ ఇస్తారు. ఆయనకే చంద్రబాబును కుప్పంలో ఓడించే బాధ్యతను కట్టబెట్టారు.
ఇక మంత్రి రోజాకు జగన్ అత్యంత సన్నిహితులు. చెల్లిలా చూసుకుంటారు. జగన్ కోసం ఇంటా బయటా అసెంబ్లీలోనూ రోజా పోరాడారు. జైలుకు వెళ్లారు. అసెంబ్లీ నుంచి గెంటివేయబడ్డారు.
అయితే చిత్తూరు జిల్లాకే చెందిన పెద్దిరెడ్డికి, రోజాకు పొసగడం లేదు. రాజకీయంగా వైరుధ్యాలున్నాయి. ఆధిపత్యం విషయంలో ఇద్దరికి బేధాభిప్రాయాలున్నాయి. వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తోంది.
అయితే జగన్ ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కానీ జగన్ తనకు అండగా ఉన్న పెద్దిరెడ్డి వైపే నిలబడ్డారని రోజాకు షాకిచ్చారని సమాచారం.
పెద్దిరెడ్డి తో రోజా అంతర్గత కలహాల నేపథ్యంలో షోకాజ్ నోటీసు పంపిన జగన్ గట్టి హెచ్చరికలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి.24 గంటల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అని ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.