Nagarjuna : పెళ్లి పేరుతో నాగార్జున ని దారుణంగా మోసం చేసిన మహిళా నిర్మాత!
Nagarjuna : ఈమధ్య కాలం లో సినిమా ఇండస్ట్రీ లో ఘరానా మోసాలు ఎక్కువయ్యాయి. ఇండస్ట్రీ కి ఆకర్షిస్తులై ఎదో ఒకటి సాధిద్దాం అని వచ్చే కొంతమంది ఆశావహుల అవసరాలను గుర్తించి , కొంతమంది వాటిని తెగ వాడుకొని పైకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలం లో ఎన్నో జరిగాయి. సాధారణంగా ఇలాంటివన్నీ అమ్మాయిలకు జరుగుతూ ఉంటుంది.
కొంతమంది అమ్మాయిలను మోసం చేసి డబ్బు తీసుకోగా, మరికొంత మంది అమ్మాయిలను తమ సుఖాలకు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంటారు. పాపం అలాంటి అమ్మాయిలు కృష్ణ నగర్ లో ఇప్పటికీ మోసపోయి తిరుగుతూనే ఉంటారు. ఇంటికి కూడా తిరిగి వెళ్లలేని పరిస్థితి పాపం వాళ్ళది. ఇదంతా పక్కన పెడితే ఒక మహిళా నిర్మాత నాగార్జున కి పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి దారుణంగా మోసం చేసింది. నాగార్జున అంటే అక్కినేని నాగార్జున అని మీరు పొరపాటు పడ్డారేమో.
కానీ సినిమా హీరో నాగార్జున కాదు కెమెరామెన్ నాగార్జున. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ మహిళా నిర్మాత ఆశా మల్లికా తనని దారుణంగా మోసం చేసింది అంటూ నాగార్జున అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ని నమోదు చేసాడు. ఇది వరకు మా ఇద్దరికీ చిలకలూర్ బాలాజీ దేవాలయం లో పెళ్లి అయ్యిందని, కానీ తనని మోసం చేసి మరో పెళ్ళికి సిద్ధం అయ్యిందని, గతం లో ఆమెకి రెండు సార్లు పెళ్లి జరిగిందని నాగార్జున ఫిర్యాదు లో పేర్కొన్నాడు.
పెళ్లి పేరుతో తన దగ్గర 18 లక్షల రూపాయిలు తీసుకొని ఉడాయించిందని, ఆమెని ఎలా అయినా పట్టుకొని తనకి న్యాయం చేయాల్సిందిగా నాగార్జున పోలీసులను డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసాడు. పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరిపి త్వరలోనే కోర్టు లో న్యాయం జరిగేలా చేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలిపారు.